తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రభాస్ సెట్​లో ఉంటే ఫుల్ ఎంజాయ్' - రిధి కుమార్ తాజా న్యూస్

Radhe shyam release date: జాతకం చూపించుకునే సాహసం తన జీవితంలో ఇప్పటి వరకు చేయలేదని యువ కథానాయిక రిధికుమార్ అన్నారు. యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఇంకా చిత్ర విశేషాలను 'ఈటీవీ భారత్​' పంచుకున్నారు రిధి. ఆ వివరాలు మీకోసం..

ridhi kumar
రిధి కుమార్

By

Published : Mar 6, 2022, 7:14 PM IST

Radhe shyam release date: యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్, పూజహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. చిత్రంలో విలువిద్య క్రీడాకారిణిగా నటించింది యువనటి రిధి కుమార్. జాతకం చూపించుకునే సాహసం తన జీవితంలో ఇప్పటి వరకు చేయలేదని యువ కథానాయిక రిధికుమార్ 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

సెట్​లో డార్లింగ్ ప్రభాస్​తో ఎంతో సందడి చేసేవాళ్లమని పేర్కొన్నారు. రాధేశ్యామ్ ఒక గొప్ప ప్రేమకథ చిత్రంగా ఉండబోతుందని రిధి కుమార్ వివరించారు.

ఇక ఈ చిత్రం అమెరికాలో గ్రాండ్​గా రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 10న రికార్డు స్థాయిలో ప్రీమియర్​ షోలు ప్రదర్శన కానున్నాయి. 1,116 లోకేషన్లలో 11,116 షోలు వేయనున్నారు. అడ్వాన్స్​ బుకింగ్స్​ కూడా రికార్డు స్థాయిలో అవుతున్నట్లు తెలిసింది.

కాగా, రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

రాధేశ్యామ్

ఇదీ చూడండి:'రాధేశ్యామ్​' ఫస్ట్​ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details