తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఖరారు - son of india mohan babu

Radhe Shyam Release Date: ప్రభాస్, పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

radhe shyam release date
radhe shyam

By

Published : Feb 2, 2022, 9:10 AM IST

Updated : Feb 2, 2022, 9:29 AM IST

Radhe Shyam Release Date: రెబల్​ స్టార్​ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్​ డేట్ ఖరారైపోయింది. కరోనా కారణంగా ఇటీవలే వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపింది చిత్రబృందం.

''రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్

1970ల నాటి ప్రేమకథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్​లో ఈ సినిమా విడుదల కానుంది.

'స‌న్ ఆఫ్ ఇండియా' ఎప్పుడంటే..

మోహ‌న్ బాబు(Mohanbabu) హీరోగా డైమండ్ ర‌త్న‌బాబు తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'స‌న్ ఆఫ్ ఇండియా'. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇళ‌యరాజా స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.

'స‌న్ ఆఫ్ ఇండియా'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:'భీమ్లా నాయక్​' బాటలో 'గని'.. పూజలో 'కేజీఎఫ్2'​ స్టార్​ యశ్​

Last Updated : Feb 2, 2022, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details