Radhe Shyam Release Date: అర్జునుడి లాంటి రూపం, భీముడి లాంటి బలం, అభిమన్యుడి లాంటి పౌరుషం, రాముడి లాంటి గుణం, కృష్ణుడి లాంటి సమ్మోహనం.. ఆ పిల్లవాడి పేరే 'ప్రభాస్'. ఇవి నేను అన్న మాటలు కాదండి బాబు.. 'బాహుబలి-1' ఆడియో ఫంక్షన్లో సినీ రచయిత విజయేంద్రపసాద్ అన్నవి. ప్రభాస్ కట్ అవుట్‌ను వివరించాలంటే ఇంత కన్నా ఎక్కువ మాటలు కావాలా చెప్పండి..
బాహుబలి, సాహో లాంటి యాక్షన్ మూవీస్‌తో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా మారిన ప్రభాస్ ఫస్ట్ టైం ఒక్క ఫైట్ కూడా లేకుండా చేస్తున్న అవుట్ అండ్ అవుట్ లవ్‌స్టోరీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రత్యేకంగా విలన్లు కానీ ఫైట్స్ కానీ లేవని.. 'లవ్ అండ్ డెస్టినీ' మధ్యే పెద్ద యుద్ధం అని డైరెక్టర్ రాధాకృష్ణ ఇదివరకే చెప్పారు.
మరి ఈ రేంజ్ బడ్జెట్ పెట్టి ఎలాంటి ఫైట్స్ లేకుండా తీసిన ఎక్స్పెరిమెంటల్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. ప్రభాస్ లాంటి సాలిడ్ కట్ అవుట్ ఉండి కూడా కథ, విజువల్స్ ప్రాధాన్యంగా సినిమాను తీయడం ఓ సాహసమే చెప్పాలి. మరి ఈ చిత్ర యాక్షన్ డైరెక్టర్ నిక్ పౌల్ చెప్పినట్లుగా.. క్లైమాక్స్, షిప్ ఎపిసోడ్లు ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తే ఇక రాధేశ్యామ్‌కు తిరుగులేదని చెప్పొచ్చు.
మరి సిక్స్ ఫీట్ బాహుబలి.. దాదాపు 12 ఏళ్ల తర్వాత చేస్తున్న ప్రేమకథ అటు ఫ్యాన్స్‌తోపాటు మాస్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
యూఎస్ గ్రాండ్ రిలీజ్..