Prabhas radhe shyam: డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లో నుంచి ఎదురుచూస్తున్న సినిమా 'రాధేశ్యామ్'. మరికొన్ని రోజుల్లో అంటే మార్చి 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌కు సిద్ధమవుతుంది చిత్రబృందం. హీరోహీరోయిన్ ప్రభాస్, పూజా హెగ్డే.. దేశంలో పలు నగరాలు చుట్టేసి, పలు ఈవెంట్స్‌లో పాల్గొని సందడి చేయనున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో హైదరాబాద్, చెన్నై, కొచి, బెంగళూరుతోపాటు హిందీ ప్రేక్షకుల్ని కవర్ చేసేందుకు ముంబయిలో 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు, నేషనల్ మీడియాతో ప్రెస్మీట్లతో హైప్ పెంచనున్నట్లు తెలుస్తోంది.