Radhe shyam pre release event: ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో డిసెంబరు 23న 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్‌తో సినిమాలు చేయబోయే పలువురు దర్శకుడు పాల్గొన్నారు. అలానే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా విచ్చేశారు. ఎంతో సందడిగా సాగిన ఈ ఈవెంట్ హైలెట్స్ వీడియోను నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బుధవారం విడుదల చేసింది. మీరు మరి ఓ లుక్కేయండి.
1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. జనవరి 14న 'రాధేశ్యామ్'.. థియేటర్లలోకి రానుంది.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం'. టైమ్ ట్రావెల్ కథతో తీస్తున్న ఈ సినిమా టీజర్‌ను హీరో సూర్య, బుధవారం విడుదల చేశారు. ఆద్యంతం అలరిస్తున్న ఈ టీజర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
ఇందులో అక్కినేని అమల, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Krithi shetty: సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సహకారమందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చేసింది. ఇటీవలే 'పుష్ప'తో హిట్ అందుకుందీ మైత్రీమూవీ మేకర్స్.