Radhe Shyam Prabhas: డార్లింగ్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' నుంచి హృద్యమైన మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'ది సోల్ ఆఫ్ రాధేశ్యామ్'గా వచ్చిన వీడియోలోని సంగీతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిచింది.
ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మార్చి 11 విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో విజవంతంగా ప్రదర్శితమవుతోంది.
మహేశ్ చేతుల మీదుగా ట్రైలర్..
చాలాకాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్. ఆర్. ఎస్. జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు.
ఏప్రిల్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విభిన్న కథా చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళీ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు సంగీతం మార్క్ కె. రాబిన్ అందించారు.
ఆసక్తికరంగా 'రన్‌వే 34' ట్రైలర్..
బాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రానుంది. అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రమే 'రన్‌వే 34'. రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవగణ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 2015లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
విమానయాన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్, రకుల్ పైలట్లుగా, అమితాబ్ విచారణాధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు.
శేష్.. అచ్చం మేజర్ సందీప్‌లా..