తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ 'రాధేశ్యామ్'​ సంక్రాంతికి రిలీజ్ - pawan movie sankranthi

స్టార్ హీరోలు పవన్​, మహేశ్​, ప్రభాస్ సినిమాలు ఒకేసారి, అదీ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తే? వావ్.. సూపర్​ కదా! ఈసారి అలానే జరగనుంది. ప్రభాస్ 'రాధేశ్యామ్' పండగకే రిలీజ్ కానుంది.

RADHE SHYAM ON SANKRANTHI 2022
ప్రభాస్ రాధేశ్యామ్

By

Published : Jul 30, 2021, 9:37 AM IST

Updated : Jul 30, 2021, 10:10 AM IST

ఈసారి సంక్రాంతికి సినిమాల సందడి మాములుగా ఉండదు. బాక్సాఫీసు దద్దరిల్లిపోవడం ఖాయం. ఎందుకంటే అగ్రహీరోలు పవన్​కల్యాణ్, మహేశ్​బాబు, ప్రభాస్ తమ సినిమాలతో ప్రేక్షకుల అలరించేందుకు సిద్ధమయ్యారు.

సంక్రాంతికి స్టార్స్ హంగామా

మహేశ్ 'సర్కారు వారి పాట', పవన్-రానా 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​ ఇప్పటికే 2022 సంక్రాంతి బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ప్రభాస్ 'రాధేశ్యామ్' కూడా పండగకే రానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సూట్​ వేసుకుని సూట్​కేసు పట్టుకుని ఉన్న ప్రభాస్ కొత్త పోస్టర్​ను శుక్రవారం విడుదల చేసింది.

టైమ్ ట్రావెల్​ కథతో?

'రాధేశ్యామ్' కొత్త పోస్టర్​ చూస్తుంటే ఆసక్తికరంగా కనిపిస్తోంది. టైమ్ ట్రావెల్​ కథతో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1970ల నాటి యూరప్​ సెట్​లు ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. మరి ఎలాంటి కథతో ఈ చిత్రాన్ని తీశారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

ప్రభాస్ రాధేశ్యామ్ కొత్త పోస్టర్

బుధవారంతో(జులై 28) 'రాధేశ్యామ్' షూటింగ్​ పూర్తయిందని వెల్లడించిన టీమ్.. కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.

అద్భుత ప్రేమకథ!

వింటేజ్ ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్​కు జోడీగా పూజాహెగ్డే నటించింది. అలనాటి హీరోయిన్​ భాగ్యశ్రీ కీలక పాత్ర చేసింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

2022లో ప్రభాస్ సినిమాల సందడి

ప్రభాస్​ చేస్తున్న 'రాధేశ్యామ్' సంక్రాంతికి రానుండగా, 'సలార్' ఏప్రిల్​లో, 'ఆదిపురుష్' ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతాయి కనుక.. ఈ సినిమాలన్నీ కలిపి వందల కోట్లు కలెక్షన్లు సాధించే అవకాశముంది. దీనిని బట్టి వచ్చే ఏడది బాక్సాఫీస్​ బద్దలవడం ఖాయం!

ఇవీ చదవండి:

Last Updated : Jul 30, 2021, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details