తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధేశ్యామ్' న్యూ స్టిల్స్.. రాజమౌళి రిలీజ్ చేసిన 'హీరో' ట్రైలర్ - DJ Tillu movie posyponed

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాధేశ్యామ్, హీరో, డీజే టిల్లు, హిందీ 'విక్రమ్ వేదా', ద కశ్మీర్ ఫైల్స్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Radhe shyam new stills
రాధేశ్యామ్ మూవీ

By

Published : Jan 10, 2022, 4:29 PM IST

Radhe shyam stills: సంక్రాంతికి రావాల్సిన ప్రభాస్ 'రాధేశ్యామ్'.. ఇప్పటికే వాయిదా పడింది. అయితే సినిమా చూడలేకపోతున్నాం అని అనుకునే ఫ్యాన్స్​ను కాస్త సంతోషపరిచేందుకు కొత్త స్టిల్స్​ను ట్వీట్ చేశారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఇందులో స్మార్ట్​గా కనిపిస్తున్న ప్రభాస్.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్, పాలమిస్ట్(హస్తరేఖా సాముద్రిక నిపుణుడు)గా నటించారు. పూజాహెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ఇచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి

Hero trailer: 'హీరో' సినిమా ట్రైలర్ రిలీజైంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. దీనిని విడుదల చేశారు. ఆద్యంతం ఎంటర్​టైనింగ్​ ఉన్న ఈ ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాల్ని పెంచుతుంది.

హీరో కావాలనుకునే వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథతో ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. జిబ్రాన్ సంగీతమందించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. జనవరి 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

DJ Tillu movie: సంక్రాంతికి రావాల్సిన మరో సినిమా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో 'డీజే టిల్లు' చిత్రాన్ని తీసుకురావడం లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పింది.

డీజే టిల్లు మూవీ

సిద్ధు, నేహా శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఎంటర్​టైనర్​కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ఇచ్చారు.

Vikram vedha hrithik roshan: 'విక్రమ్ వేదా' హిందీ రీమేక్​ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్​లుక్ వచ్చింది. సోమవారం దీనిని రిలీజ్ చేశారు. ఒరిజినల్​లో విజయ్ సేతుపతి చేసిన రోల్​లో హృతిక్ కనిపించనున్నారు. మరో ప్రధాన పాత్రలో సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 30న థియేటర్లలోకి రానుందీ సినిమా.

'విక్రమ్ వేదా' హిందీ మూవీ హృతిక్ రోషన్ ఫస్ట్​లుక్
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details