అగ్రకథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న వింటేజ్ ప్రేమకథ 'రాధేశ్యామ్' చిత్ర షూటింగ్ శుక్రవారం నుంచి పున: ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ఓ డ్యూయెట్ సాంగ్, కీలక సన్నివేశాలను చిత్రీకరించి.. దసరా పండగ సందర్భంగా అక్టోబర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.
జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా.. కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.