Sankranthi 2022 movies: ఈసారి సంక్రాంతికి వచ్చే భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్ అని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' వాయిదా ఖరారని సమాచారం వస్తున్నప్పటికీ, 'రాధేశ్యామ్' మాత్రం 'తగ్గేదే లే' అని అంటుంది.
న్యూ ఇయర్ కానుకగా షేర్ చేసిన కొత్త పోస్టర్లో జనవరి 14 అని రిలీజ్ డేట్ ఉంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. మరి పోస్టర్లో చెప్పినట్లు అదే రోజు రిలీజ్ చేస్తారా? లేక ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి.