తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధేశ్యామ్' రిలీజ్​.. ఓటీటీ లేదా థియేటర్​లోనా? - ప్రభాస్ రాధేశ్యామ్

Radhe shyam OTT: 'రాధేశ్యామ్' సినిమా ఓటీటీలో రిలీజ్​ అంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఓ నెటిజన్​ ట్వీట్​కు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

radhe shyam movie
'రాధేశ్యామ్' మూవీ

By

Published : Jan 26, 2022, 1:54 PM IST

Prabhas Radhe shyam: తెలుగులో ఓ పెద్ద సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందని బుధవారం ఉదయం నుంచి తెగ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో దీని గురించే తెగ చర్చించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్​పై దర్శకుడు రాధాకృష్ణ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాను బిగ్​స్క్రీన్​పై మాత్రమే ఎక్స్​పీరియెన్స్​ చేయాలని 'రాధేశ్యామ్' మూవీ టీమ్​ భావిస్తోంది. అందులో భాగంగానే చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, కొవిడ్ పరిస్థితులు సర్దుకున్న తర్వాత నిర్మాత సంస్థ రిలీజ్ డేట్ ప్రకటిస్తుందని డైరెక్టర్ రాధాకృష్ణ స్పష్టం చేశారు.

1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్​ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ కరోనా ప్రభావం వల్ల అది కాస్త వాయిదా పడింది. అయితే సినిమాను మార్చి 18న థియేటర్లలోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్​లో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details