డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి తొలి లిరికల్ (radhe shyam song) వచ్చేసింది. 'ఈ రాతలే' అనే లిరిక్స్‌తో ఉన్న ఈ పాట.. శ్రోతల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో ప్రభాస్(prabhas movies) సరసన పూజాహెగ్డే(pooja hegde movies) హీరోయిన్గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది 'రాధేశ్యామ్'(radhe shyam release date).
ఈ సినిమాలో ప్రభాస్(prabhas radhe shyam movie).. పాలమిస్ట్(చేతిరేఖలు చూసి భవిష్యత్ చెప్పే వ్యక్తి) పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రాధేశ్యామ్' టీజర్.. ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
1970ల నాటి యూరప్ నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రాధాకృష్ణ కుమార్(radhe shyam director) దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు.