తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెజ్​ హోటల్​లో చికెన్​ బిర్యానీ పెడతారా?.. విమర్శలపై 'రాధేశ్యామ్' డైరెక్టర్​ - ప్రభాస్

Radhe Shyam: ఒక ప్రేమ కథ నుంచి ఇంకేం ఆశిస్తారని విమర్శకులపై అసహనం వ్యక్తంచేశారు 'రాధేశ్యామ్' దర్శకుడు రాధాకృష్ణ. సినిమాపై వస్తున్న నెగిటివ్​ కామెంట్స్​కు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన గట్టిగా కౌంటర్​ ఇచ్చారు.

Radhe Shyam
Radhe Shyam director on negative reviews

By

Published : Mar 14, 2022, 6:38 PM IST

Radhe Shyam: డార్లింగ్ ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్'​.. విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. విజువల్స్​ పరంగా గ్రాండ్​గా ఉన్నప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది! అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు, క్రిటిక్స్​ నుంచి వస్తున్న నెగిటివ్ కామెంట్స్​పై చిత్ర దర్శకుడు రాధాకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రేమ కథ నుంచి ఇంకేం ఆశిస్తారని వారిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారాయన.

ప్రభాస్​తో రాధాకృష్ణ

"వెజిటేరియన్​ హోటల్​కు వెళ్లి.. చికెన్​ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు? 'రాధేశ్యామ్​' ప్రేమకథ అని ముందు నుంచే చెబుతున్నాం. అయినా సినిమాలో యాక్షన్​ లేదని విమర్శకులు అంటున్నారు. అందులో అర్థం ఉందా అసలు?"

- రాధాకృష్ణ, దర్శకుడు

అంతకుముందు ప్రభాస్​ కూడా.. తన యాక్షన్​ ఇమేజ్​కు దూరంగా ఓ విభిన్నమైన సినిమా చేయాలనుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే 'రాధేశ్యామ్'​ అనే లవ్​స్టోరీ వచ్చింది. ఇది ఒక పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఇందులో హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు ప్రభాస్. విధికి ప్రేమకు మధ్య యుద్ధం అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

కలెక్షన్లలో దూకుడు..

'రాధేశ్యామ్'

టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది 'రాధేశ్యామ్'. మార్చి 11న ఈ చిత్రం విడుదల కాగా, మూడు రోజుల్లోనే రూ.151 కోట్ల గ్రాస్​ వసూళ్లు సాధించింది.

ఇదీ చూడండి:ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే

ABOUT THE AUTHOR

...view details