సల్మాన్‌ఖాన్, దిశాపటానీ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాధే'. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి 'సీటీమార్' వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో సల్మాన్ డ్యాన్స్ చూసి ఆయన అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, నేడు ఈ సాంగ్ మేకింగ్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌కేఎఫ్ (సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్) నెట్టింట్లో షేర్ చేసింది.
'రాధే' నుంచి 'సీటీమార్' మేకింగ్ వీడియో - సీటీమార్ మేకింగ్ వీడియో రిలీజ్
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే' చిత్రం నుంచి ఇటీవలే 'సీటీమార్' అనే సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ వీడియోకు సంబంధించిన మేకింగ్‌ను పంచుకుంది చిత్రబృందం.

సీటీమార్
పాట చిత్రీకరణ సమయంలో తమకున్న అనుభవాలను సల్మాన్, దిశాతోపాటు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా అందరితో పంచుకున్నారు. "ఏ స్టెప్పు చెప్పినా సరే సల్మాన్ నో చెప్పలేదు. మేము చెప్పిన డ్యాన్స్ మూమెంట్స్‌ని ఆయన ఇష్టంతో చేశారు" అని ప్రభుదేవా తెలిపారు. ఈ మేకింగ్ వీడియోని మీరూ చూసేయండి.