ఓ వర్గం వ్యక్తుల మనోభావాలను కించపరుస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసినందుకు సినీనటి మాధవీలతపై.. రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఉగ్రవాద కార్యకలాపాల విషయమై ఓ వర్గానికి ఆపాదిస్తూ చేసిన కామెంట్లపై వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ హరినాథ్ తెలిపారు.
టాలీవుడ్ యువనటి మాధవీలతపై కేసు నమోదు - actress madhavilatha latest news
'నచ్చావులే' ఫేం నటి మాధవీలతపై రాచకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఆమె ట్విట్టర్లో అభ్యంతరకరమైన ట్వీట్లు చేసిందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.
సినీనటి మాధవీలతపై కేసు నమోదు
మాధవిలత ప్రస్తుతం 'లేడీ' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు జీఎస్‌ఎస్‌ఎస్‌పీ కల్యాణ్ దర్శకుడు. చరన్స్ క్రియేషన్స్, జీఎస్‌ఎస్‌ఎస్‌పీకే స్టూడియోస్ పతాకాలపై సినిమా నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.