తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్ జ్యోతిక 'రాక్షసి' అవతారం! - ఉపాధ్యాయురాలిగా జ్యోతిక

పెళ్లి తర్వాత విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న జ్యోతిక.. త్వరలో 'రాచ్చసి'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయ నాయకుల్ని ఎదిరించే టీచర్ పాత్రలో ఆమె నటించింది.

మరో వైవిధ్యపాత్రలో హీరోయిన్ జ్యోతిక

By

Published : Jun 1, 2019, 6:43 PM IST

జ్యోతిక నటిస్తున్న తమిళ చిత్రం ‘రాచ్చసి’. ప్రధానోపాధ్యాయురాలి పాత్రలో ఆమె కనిపించనుంది. ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వం వహించాడు. ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు నిర్మాతలు. ఈ నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

విద్యార్థులు, తన తోటి టీచర్లతో కలిసి పాఠశాలలో గీతారాణి (జ్యోతిక) తీసుకొచ్చిన మార్పులేంటి అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. బయట నుంచి అడ్డంకులు సృష్టించిన రాజకీయ నాయకులతో ఎలా తలపడింది అనేది తెలియాలంటే చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే. ఉపాధ్యాయురాలిగా జ్యోతిక వైవిధ్యంగా కనిపించింది.పూర్ణిమ భాగ్యరాజ్, హరీష్‌ పారెడి, సత్యన్‌ తదితరులు రాచ్చసిలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

పెళ్లి తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది జ్యోతిక. 2017లో ‘మగలిర్‌ మట్టుమ్‌’, 2018లో ‘నాచియార్‌’ తెలుగులో ‘ఝాన్సీ’గా వచ్చింది. ఇందులో పోలీస్‌ అధికారిగా జ్యోతిక నటనకు ప్రశంసలు దక్కాయి.

ఇది చదవండి: సమంత ఓ బేబీ కొత్త పాట.. 'ఆకారం తూనీగ.. ముట్టుకుంటే కందిరీగ'

ABOUT THE AUTHOR

...view details