మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా రాశీ ఖన్నా ఈ సినిమా టికెట్లను విక్రయించింది. హైదరాబాద్‌లోని గోకుల్ థియేటర్లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులకు 'ప్రతిరోజూ పండగే' చిత్ర టికెట్లను అమ్మింది.
థియేటర్లో టికెట్లు అమ్మిన రాశీ ఖన్నా - telugu cinema news
ప్రముఖ నటి రాశీ ఖన్నా హైదరాబాద్‌లోని గోకుల్ థియేటర్లో సందడి చేసింది. సాయిధరమ్ తేజ్ సరసన తను నటించిన 'ప్రతిరోజూ పండగే' సినిమా ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా టికెట్లను అభిమానులకు విక్రయించింది.
థియేటర్లో టికెట్స్ అమ్మిన రాశి ఖన్నా
కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్‌కు తాతయ్యగా సత్యరాజ్ నటించాడు. డిసెంబరు 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్, పాటలు, ఫస్ట్‌లుక్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచాయి.