తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్ హీరో ధనుష్​కు జోడీగా రాశీఖన్నా

హీరో ధనుష్​తో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకుంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఇందులో ఆమెతో పాటు నిత్యామేనన్, ప్రకాశ్​రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

dhanush, raashii khanna
హీరో ధనుష్, రాశీఖన్నా

By

Published : Aug 4, 2021, 8:24 PM IST

ముద్దుగుమ్మ రాశీఖన్నా బంపర్ ఆఫర్ కొట్టేసింది. స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త తమిళ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. 'డీ44' పేరుతో వస్తున్న ఈ చిత్రంలో నిత్యమేనన్​, ప్రకాశ్​ రాజ్​, ప్రముఖ దర్శకుడు భారతి రాజా కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ధనుష్-రాశీఖన్నా జంటగా చేస్తున్న తొలి సినిమా ఇదే.

ఈ సినిమాను సన్​ పిక్చర్స్​ నిర్మిస్తుండగా, మిత్రన్​ జవహర్​ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఉత్తమపుత్రిన్', 'మథిల్' వంటి కోలీవుడ్ సినిమాలకు మిత్రన్​ డైరెక్టర్.

తెలుగుతో పాటు తమిళంలో ప్రస్తుతం బిజీగా ఉన్న రాశీఖన్నా.. 'మద్రాస్​ కేఫ్'​ సినిమాతో హీరోయిన్​గా పరిచయమైంది. టాలీవుడ్​లో 'బెంగాల్​ టైగర్'​, 'సుప్రీం' వంటి సినిమాల్లో నటించి అభిమానులను మెప్పించింది.

బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగణ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ 'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌'. రాజేష్‌ మపుస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనూ రాశీఖన్నా కీలక పాత్రలో నటించనుంది. ఇందులో ఆమె సైకో కిల్లర్​గా కనిపించనుందట. ఇదే ఆమెకు తొలి వెబ్ సిరీస్​ కానుంది. మరోవైపు 'ఫ్యామిలీ మ్యాన్' దర్శకద్వయం రాజ్-డీకే తీస్తున్న వెబ్ సిరీస్​లోనూ రాశీఖన్నా నటిస్తోంది.

ఇదీ చదవండి:టీజర్​​తో 'ఇందువదన'.. రీతూవర్మ 'నాగిని డ్యాన్స్​'

ABOUT THE AUTHOR

...view details