'ఊహలు గుసగుసలాడే'తో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీఖన్నా.. త్వరలో రెండు తమిళ సినిమాల్లో నటించనుంది. 'అరన్మనై 3'తో పాటు సూర్య హీరోగా రూపొందుతున్న 'అరువా'లో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఈ ప్రాజెక్టును మాస్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నారు. ట్విట్టర్లో అభిమానులతో తాజాగా చర్చిస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
సూర్య సినిమాలో ఆఫర్ కొట్టేసిన రాశీ - SINGAM SERIES
కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న 'అరువా'లో హీరోయిన్గా చేస్తున్నట్లు రాశీఖన్నా స్పష్టం చేసింది. అభిమానులతో ట్విట్టర్లో చర్చిస్తూ ఈ విషయాన్ని పంచుకుంది.
ఇప్పటికే సూర్య-హరి కాంబినేషన్లో 'ఆరు', 'వేల్', 'సింగం', 'సింగం 2', 'సింగం 3' చిత్రాలు విడుదలై ఘనవిజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న 'అరువా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం 'ఆకాశం నీ హద్దురా!' అనే బయోపిక్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు సూర్య. ఎయిర్ డెక్కన్ ఛీప్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా దీనిని తీస్తున్నారు.
ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశీ.. ఆ సినిమా చేసి తప్పుచేశానని చెప్పింది. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.