'ఊహలు గుసగుసలాడే'తో హీరోయిన్గా పరిచయమైన రాశీఖన్నా.. అందులో బొద్దుగా, ముద్దుగా కనిపించి.. అభిమానుల గుండెల్ని మెలిపెట్టేసింది. ఆ తర్వాత తన శరీరాకృతి విషయంలో చాలా శ్రద్ధ పెట్టి నాజుగ్గా తయారైంది. ఇప్పుడు ప్రత్యేకంగా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. దీని వల్ల తాను మరింత పవర్‌ఫుల్‌గా తయారవుతున్నానని తెలిపింది.
కిక్ బాక్సింగ్‌తో బిజీ.. కారణం చెప్పిన రాశీ
కిక్ బాక్సింగ్ ప్రాక్టీసుతో బిజీగా ఉన్న నటి రాశీఖన్నా.. అది నేర్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె ఓ వెబ్‌సిరీస్, పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
"నాలోని రెబల్ కోణాన్ని కిక్ బాక్సింగ్ బయటకు తీస్తోంది. దీని వల్ల మరింత పవర్‌ఫుల్‌గా తయారవుతున్నాను. ఎలాంటి ఛాలెంజ్‌ను అయినా ఎదుర్కోగలనని అనిపిస్తోంది. ఓ యాక్టర్‌గా ఫ్రస్టేషన్‌ను ఎవరిపై చూపించలేం. అలాంటప్పుడు జిమ్‌కు వెళ్లి కిక్ బాక్సింగ్ చేస్తుంటే రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. నేను చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ప్రిపరేషన్‌కూ ఇది ఉపయోగపడుతోంది" అని రాశీఖన్నా చెప్పింది.
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చేస్తున్న రాఖీఖన్నా.. తమిళంలో 'తుగ్లక్ దర్బార్', మలయాళ 'అంధాధున్' రీమేక్‌తో బిజీగా ఉంది.