కరోనా పరిస్థితుల్లోనూ, 'థాంక్యూ' షూటింగ్ కోసం ఇటలీ వెళ్లొచ్చింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ అనుభవాల్ని ఇప్పుడు వెల్లడించింది. రోజుకు 18 గంటల పాటు చిత్రీకరణ చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది.
"ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటలీ వెళ్లాలంటే తొలుత భయపడ్డాను. కానీ మేం సినిమా త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇటలీ ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు పక్కాగా విధించింది. మేం కూడా సెట్లో రూల్స్ పాటిస్తూనే చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ క్రమంలోనే రోజుకు 18 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి" అని రాశీఖన్నా వెల్లడించింది.