'ఊహాలు గుసగుసలాడే' చిత్రంలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటి రాశీఖన్నా. ఆమె చివరగా విజయ్‌దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్'లో నటించారు. అనంతరం ఆమె నుంచి ఎటువంటి చిత్రం రాలేదు. ఆమె తాజాగా 'తుగ్లక్ దర్బార్' అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొన్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దిల్లీ ప్రసాద్ దీనదయాలన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి సరసన రాశీఖన్నా నటించనున్నారు.
'తుగ్లక్ దర్బార్'లో విజయ్ సరసన ఎవరంటే? - తుగ్లక్ దర్బార్‌లో రాశీఖన్నా
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తోన్న కొత్త చిత్రం 'తుగ్లక్ దర్బార్'. డేట్ల సర్దుబాటు కారణంగా నటి అదితీరావ్ హైదరీ ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆమె స్థానంలో రాశీ ఖన్నాను చిత్రబృందం ఎంచుకుంది.
మొదట ఈ చిత్రంలో అదితీ రావ్ హైదరీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం వల్ల ఆమె తప్పుకొన్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ రాశీఖన్నాకు స్వాగతం పలుకుతూ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ చిత్ర షూటింగ్‌లో ఆమె ఈ మధ్యే పాల్గొన్నారు. విజయ్‌సేతుపతి, రాశీఖన్నా కలిసి ఇది వరకే ఒక తమిళ చిత్రంలో నటించారు.
'తుగ్లక్ దర్బార్'ను ఈ ఏడాది మొదట్లోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. పార్తీబన్, మంజిమా మోహన్, కరుణాకరన్, భగవతి పెరుమాళ్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.