తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాహీరోతో లవ్​ట్రాక్​ వార్తల్లో నిజం లేదు: రాశీఖన్నా - మెగాహీరోతో లవ్​ట్రాక్​పై రాశీఖన్నా

మెగా హీరోతో లవ్​ట్రాక్​ నడుపుతుందన్న వార్తల్లో నిజం లేదని చెప్పిన రాశీఖన్నా.. అవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. పరిశ్రమలో తనకు ఎంతోమంది ఫ్రెండ్స్​ ఉన్నారని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించింది.

raashi khanna in ali tho saradaga talk show
'మెగాహీరోతో లవ్​ట్రాక్​ వార్తల్లో నిజం లేదు'

By

Published : Nov 5, 2020, 6:15 PM IST

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్​కు పరిచయమైన రాశీఖన్నా.. ఎంతోమంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఇటీవలే విడులైన 'వరల్డ్​ ఫేమస్​ లవర్'తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు స్కైజంప్​ అంటే ఎంతో ఇష్టమని.. 14 వేల అడుగుల ఎత్తున ఆకాశం నుంచి దూకినట్లు గతంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైనప్పుడు వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ ప్రయాణంలోని ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

హీరోలతో స్నేహం

హీరోలతో ఎక్కువగా చనువుగా ఉంటున్నాననే వార్తల్లో నిజం లేదని రాశీఖన్నా స్పష్టం చేసింది. హీరోయిన్లలో రకుల్​ప్రీత్​ సింగ్​, లావణ్య త్రిపాఠిలతో ఎక్కువ సన్నిహితంగా ఉంటానని చెప్పింది.

మెగాహీరోతో లవ్​ట్రాక్!

మెగా హీరోతో లవ్​లో పడ్డావనే ఇండస్ట్రీలో టాక్​ వినిపిస్తుంది అని వ్యాఖ్యాత అలీ రాశీఖన్నాను ప్రశ్నించగా.. అయితే అతడు ఎవరో చెప్పండి అంటూ బదులు ప్రశ్నించింది రాశీ. ఆ వార్తల్లో నిజం లేదని, అవి కేవలం పుకార్లేనని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details