తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వెంకీమామ'లో రాశి ఖన్నా పాత్ర ఇదేనా ..! - venkymama

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా వెంకీమామ. ఈ చిత్రంలో పాయల్ రాజ్​పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో స్కూల్ టీచర్​ పాత్రలో కనిపించనుందట రాశి.

సినిమా

By

Published : Aug 25, 2019, 9:07 AM IST

Updated : Sep 28, 2019, 4:43 AM IST

వెంకటేష్‌-నాగచైతన్య కథానాయకులుగా నటిస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం 'వెంకీమామ.’ ఈ సినిమాలో వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోండగా.. చైతూకు జోడీగా రాశి ఖన్నా కనిపించబోతుంది. యువ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో వెంకటేష్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది రాశి ఖన్నా. వెంకీ స్టైలిష్‌గా ఓ పక్కకు తిరిగి చిరునవ్వులు చిందిస్తుండగా.. ఆయన్ను గట్టిగా కౌగిలించుకుని మురిసిపోతూ కనిపించింది రాశి. అంతేకాదు లంగా ఓణి ధరించి ఎంతో సంప్రదాయంగా కనిపించింది.

వెంకటేష్, రాశి ఖన్నా

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించన ఓ వార్త వినిపిస్తోంది. చిత్రంలో పల్లెటూరిలోని ఓ స్కూల్‌లో పాఠాలు చెప్పే టీచర్‌గా కనిపించనుందట రాశి. అందుకే ఇలా లంగా ఓణి లుక్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీ.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. జాన్వీ కపూర్​పై ట్రోల్స్​.. ఏమైందంటే!​

Last Updated : Sep 28, 2019, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details