తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ స్వీకరించిన రాశీ ఖన్నా - మొక్కలు నాటిన రాశీ ఖన్నీ

హీరోయిన్ రష్మిక మంధాన విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించింది నటి రాశీ ఖన్నా. మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేసింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ స్వీకరించిన రాశీ ఖన్నా
గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ స్వీకరించిన రాశీ ఖన్నా

By

Published : Jul 20, 2020, 4:42 PM IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్‌ తారలు మొక్కలు నాటి.. మీరూ మొక్కలు నాటండి అని పిలుపునిస్తున్నారు. ఇటీవల యువ కథానాయిక రష్మిక మంధాన మొక్కలు నాటి రాశీ ఖన్నాకు ఛాలెంజ్‌ విసిరింది. దానిని స్వీకరించిన రాశి ఈ రోజు మొక్కలు నాటింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్‌ చేసింది. మరో ముగ్గురుని నామినేట్‌ కూడా చేసింది.

"నన్ను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నామినేట్‌ చేసినందుకు రష్మికకు ధన్యవాదాలు. ఈ ట్వీట్‌ చదువుతున్న అందరూ మొక్కలు నాటండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొనేలా చేయండి. ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లండి"’ అని రాశి కోరింది. ఈ హరిత సవాలులో పాల్గొనాల్సిందిగా ప్రముఖ కథానాయికలు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌, తమన్నాను రాశి నామినేట్‌ చేసింది.

ABOUT THE AUTHOR

...view details