తెలుగు ప్రేక్షకులకు రాయ్ లక్ష్మి పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు. ప్రత్యేక గీతాలతో పాటు, కథానాయికగాను కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ధరించిన హాట్ ఫొటోలను పెట్టింది. ఆ ఫొటోలను చూస్తుంటే యువతను మత్తిక్కేంచేలా ఉన్నాయని సినీ జనాలు అనుకుంటున్నారు.
బికినీతో సెగ పుట్టిస్తోన్న రాయ్ లక్ష్మి - Laxmi Raai in bikini sets the internet on fire. See pic
ప్రత్యేక గీతాలతో పాటు హీరోయిన్‌గానూ మెప్పిస్తోన్న రాయ్ లక్ష్మి తాజాగా నెట్టింట ఫొటోలతో సందడి చేస్తోంది. తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన బికినీ చిత్రాలకు నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు.
ఈ ఫొటోలను పెట్టిన కొద్దిసేపటికే రాయ్ లక్ష్మికి తెగలైకులు కొట్టేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, సైకిల్‌పై బికినీ ధరించిన ఫొటోను పెడుతూ.. "నాకెంతో ఉంది. నేనెంతో ప్రేమను కలిగి ఉన్నాను. ఇక జీవితంలో ఇంత కంటే ఏమి కావాలి.." అన్నట్లు అర్థం వచ్చేలా మాటలను కవితాత్మకంగా వివరించింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మి తమిళంలో 'మృగ' అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా తెలుగులో 'గర్జన'గా తెరపైకి వస్తోంది. హారర్ డ్రామా నేపథ్యంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ నటిస్తోంది.
ఇవీ చూడండి.. 'ఏ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చెప్పలేం'