సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. టికెట్ ధర పెంపు ప్రేక్షకుడికి నష్టాన్ని చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రభుత్వమే బ్లాక్ టికెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు.
'సినిమా టికెట్ల ధర పెంపు అందరికీ చేటే' - solo brathuke so better movie success meet
థియేటర్లలో సినిమా టికెట్ల పెంపు విషయంలో పునరాలోచించుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. టికెట్ ధర పెంచడం వల్ల అటు ప్రేక్షకుడితో పాటు నిర్మాతలకు నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.
'సినిమా టికెట్ల ధర పెంపు అందరికీ చేటే'
కరోనాతో కుదేలైన చిత్ర పరిశ్రమ 9 నెలల తర్వాత థియేటర్లు తిరిగి ప్రారంభమైన సమయమిదని తెలిపారు. భారీ సినిమాల పేరుతో సినిమా టికెట్ల ధరలు పెంచడం నిర్మాతలకు, ప్రేక్షకులకు నష్టాలను తీసుకొస్తుందని సూచించారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:ఫైట్‌తో 'వకీల్‌సాబ్'ను పూర్తి చేసిన పవన్