Theatre closed: ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు మూస్తుంటే ఏడుపొస్తుందని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన 'శ్యామ్ సింగరాయ్' సక్సెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
యజమానులారా.. థియేటర్లు మూసేయొద్దు అని నారాయణమూర్తి కోరారు. ఈ విషయంలో తెలుగు నిర్మాతల మండలి, 'మా' జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను కాపాడుకోవాలని ప్రాధేయపడ్డారు. పండగ వేళ సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితి రావొద్దని అన్నారు.