తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్వీన్' ట్రైలర్: ఇది కేవలం ఆరంభం మాత్రమే - Queen trailer

రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన 'క్వీన్'​ వెబ్​ సిరీస్​ ట్రైలర్​ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది. ఈ నెల 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్​ కానుంది.

'క్వీన్' ట్రైలర్: ఇది కేవలం ఆరంభం మాత్రమే
రమ్యకృష్ణ

By

Published : Dec 5, 2019, 6:26 PM IST

తమిళనాడులో ప్రముఖ నాయకురాలిగా వెలుగొంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె జీవితంగా ఆధారంగా పలు సినిమాలు తీస్తున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'క్వీన్' అనే వెబ్​సిరీస్​ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్​లుక్​తో అంచనాల్ని పెంచిన చిత్రబృందం.. గురువారం విడుదల చేసిన ట్రైలర్​తో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

జయలలిత ఓ అసాధారణ రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగారు అనే కథాంశంతో ఈ వెబ్​సిరీస్​ను తీశారు. ఇందులో శక్తి శేషాద్రి అనే పాత్రలోని వివిధ దశల్లో జయ జీవితాన్ని చూపించనున్నారు. గౌతమ్ మేనన్, ప్రసాద్ మురుగేశన్​ దర్శకత్వం వహించారు. ఈ నెల 14 నుంచి ఎమ్​ఎక్స్ ప్లేయర్​లో స్ట్రీమ్ కానుందీ సిరీస్​.

ఇది చదవండి: వివాదంలో జయలలిత వెబ్​సిరీస్​ 'క్వీన్'..!

ABOUT THE AUTHOR

...view details