ఒక రంగంలో చెరగని ముద్ర వేయాలంటే ఒక జీవితకాలం సరిపోదు. అలాంటిది ఆమె పనిచేసిన రెండు రంగాల్లోను కోట్ల మంది అభిమానులని, ఆప్తులని సంపాదించుకుంది. చిత్ర పరిశ్రమలో దక్షిణాదిలోనే అగ్ర తారగా నిలిచి ఆ తర్వాత తమిళ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు జయలలిత.
ఒక సాధారణ మహిళ నుంచి సినీ పరిశ్రమలో అగ్ర తారగా అటునుంచి తమిళ రాజకీయాలకు దిక్సూచిగా ఎదిగిన జయలలిత జీవితం అందరికి స్ఫూర్తే, ఆసక్తికరమే. అందుకే ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఆమె జీవితం ఆధారంగా 'క్వీన్', 'తలైవి', 'ది ఐరన్ లేడి' అనే చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో 'క్వీన్' డిజిటల్ మాధ్యమం వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కింది.