తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత కథతో వెబ్ సిరీస్..

ప్రధానిగా ప్రజల మన్ననలు పొందిన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు జీవిత కథను సిరీస్​గా తీయనున్నట్లు ప్రకటించారు. త్వరలో షూటింగ్​ ప్రారంభిస్తామని తెలిపారు.

PV narasimha rao
పీవీ నరసింహారావు

By

Published : Dec 13, 2021, 10:11 PM IST

మన దేశానికి ప్రధానిగా చేసిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు బయోపిక్​ సిరీస్​కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. 'ఆహా'స్టూడియోస్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. వీరు తీస్తున్న మొదటి వెబ్ సిరీస్​ ఇదే కావడం విశేషం. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఆయన జీవితంపై రాసిన 'హాఫ్ లయన్' పుస్తకం ఆధారంగా ఈ సిరీస్​ రూపొందించనున్నట్లు తెలిపారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన దర్శకుడు ప్రకాశ్​ ఝా.. ఈ సిరీస్​కు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్​ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సిరీస్​ తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిత్రబృందం-నిర్మాతలు

పీవీ నరసింహారావు.. ప్రధాని కాకముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇందిరా గాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత 1991 జూన్ 21న భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు.

పీవీ నరసింహారావుకు 17 భాషల్లో ప్రావీణ్యం ఉండటం విశేషం. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా, ఆధునిక చాణక్యుడిగా పేరొందిన ఈయన.. 2004 డిసెంబరు 23న తుదిశ్వాస విడిచారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details