ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శ్వాని మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పుష్పక విమానం'. దామోదర్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం.. ఇటీవల థియేటర్లలో విడుదలై నవ్వులు పూయిస్తోంది. పెళ్లి ప్రాధాన్యం వివరిస్తూ ఆద్యంత హాస్యాన్ని, ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగే 'పుష్పక విమానం'లో చిట్టిలంక సుందర్, రేఖ, మీనాక్షి పాత్రలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
సక్సెస్ మీట్లో 'పుష్పక విమానం'.. ప్రేక్షకులకు థాంక్స్ - పుష్పక విమానం మూవీ
పెళ్లి నేపథ్య కథతో తెరకెక్కిన 'పుష్పక విమానం'.. ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా వాళ్లకు ధన్యవాదాలు చెబుతూ చిత్రబృందం సక్సెస్ మీట్ పెట్టింది.
పుష్పక విమానం మూవీ
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సినిమా విజయవంతం పట్ల చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది. వరంగల్ జిల్లాలో ఆదివారం పర్యటించి ప్రేక్షకులను నేరుగా కలుసుకోనున్నట్లు తెలిపింది. మరోవైపు 'పుష్పక విమానం' చిత్రానికి సంబంధించి సినీ ప్రముఖులు చాలా మంది తమ వ్యక్తిగతంగా ఇళ్లలో సినిమా చూస్తూ ఆస్వాదిస్తున్నారు.
ఇది చదవండి:Pushpaka vimanam movie review: 'పుష్పక విమానం' ఎలా ఉందంటే?