ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'(pushpa release date).. డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు(pushpa songs), టీజర్.. అభిమానులను అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్కు సంబంధించిన ఓ విషయం తెగ చర్చనీయాంశమైంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే 'పుష్ప'(pushpa release date).. నేరుగా రిలీజ్ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్లలో విడుదల కాదని అంటున్నారు. ఇప్పటికే 'పుష్ప' హిందీ డబ్బింగ్ హక్కుల్ని అమ్మేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సదరు సంస్థతో మరోసారి చర్చించిన తర్వాతే హిందీలో థియేటర్ రిలీజ్పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. దీని గురించి స్పష్టత రావాల్సి ఉంది.