సుకుమార్, అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్.. ప్రేక్షకుల్లో ఈ ముగ్గురు కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. 'ఆర్య'తో మొదలైన వీరి ప్రయాణం 'ఆర్య 2'తో మరోసారి ఆకట్టుకుంది. ఇప్పుడు 'పుష్ప'తో హ్యాట్రిక్‌కు సిద్ధమైంది. ఈ కాంబినేషన్ అంటే ముందుగా గుర్తొచ్చేది హుషారెత్తించే పాటలు. సుకుమార్- బన్నీ చిత్రానికి దేవీ సంగీతమంటే ప్రత్యేక గీతం ఉండాల్సిందే. ఈ సినిమాలోనూ ఓ ఐటెమ్ సాంగ్ ఉందని, అందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తుందని తెలుస్తోంది.
'పుష్ప'లోనూ జానపదం వినిపించబోతున్నారా! - పుష్ప సినిమా అప్డేట్స్
స్టైలిష్ స్టార్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో జానపద గీతాలకు చోటుందట. దేవీశ్రీ అందించిన సంగీతం మరోసారి ఆకట్టుకుంటుందని సమాచారం.
తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్తూరు ప్రాంతానికి సంబంధించి, అధిక భాగం అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోనుందీ సినిమా. అక్కడి పరిస్థితుల్ని, ప్రజల జీవన విధానాన్ని తెరపై చూపించబోతున్నారని తెలుస్తోంది. దానికి తగ్గట్లు జానపదాల్ని వినిపించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోందని టాక్. కథలో భాగంగా గిరిజనుల జానపదాల గీతాన్ని తెరపై చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఫోక్ సాంగ్స్‌తో ఎలా అలరిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.