తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంత ఐటెం సాంగ్‌కు బీటీఎస్‌ స్టెప్పులు.. వీడియో వైరల్ - సమంత ఐటెం సాంగ్‌కు బీటీఎస్‌ స్టెప్పులు

Pushpa Special Song BTS: కొరియన్‌ ప్రముఖ పాప్‌ సింగింగ్‌ బ్యాండ్‌ 'బీటీఎస్‌'.. తెలుగు పాటకు స్టెప్పులేసింది. అదెలాగో చూసేయండి!

Pushpa Special Song BTS
సమంత ఐటెం సాంగ్‌కు బీటీఎస్‌ స్టెప్పులు

By

Published : Jan 22, 2022, 5:22 PM IST

Pushpa Special Song BTS: ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌, రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆల్బమ్స్‌ ఎప్పుడూ సూపర్‌హిట్టే. తాజాగా వచ్చిన 'పుష్ప' అందుకు నిదర్శనం. ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి పాటా సెన్సేషనల్‌ అయ్యింది. ముఖ్యంగా 'ఊ అంటావా మావ.. ఉఊ అంటావా' పాట యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్‌ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్‌ చేసింది.

పురుషుల స్వభావాన్ని తెలియజేసే లిరిక్స్‌తో రూపుదిద్దుకున్న ఈ ఐటెం సాంగ్‌లో సమంత వంటి అగ్రకథానాయిక ఆడిపాడటం వల్ల దీనికి మరింత క్రేజ్‌ వచ్చింది. స్క్రీన్‌పై సామ్‌-బన్నీ వేసిన స్టెప్పులు చూసి ప్రతి ఒక్కరూ దీనికి ఫ్యాన్స్‌ అయిపోయారు. దీంతో ఈ పాటకు ఇప్పటికే పలువురు కవర్‌ సాంగ్స్‌, రీల్స్‌ చేసి ఆకట్టుకున్నారు.

ఇప్పుడు 'పుష్ప' సాంగ్స్‌కు కొంతమంది నెటిజన్లు ఎడిటింగ్‌ వీడియోలు క్రియేట్‌ చేసి అదరగొడుతున్నారు. ఇందులో భాగంగా.. కొరియన్‌ ప్రముఖ పాప్‌ సింగింగ్‌ బ్యాండ్‌ బీటీఎస్‌ చేసిన 'బాయ్‌ విత్‌ లవ్‌' వీడియోకు 'ఊ అంటావా మావ' పాటను జత చేస్తూ ఓ నెటిజన్‌ స్పెషల్‌ వీడియోను క్రియేట్‌ చేశాడు. 'పుష్ప' బీట్‌ని బీటీఎస్‌ ఫాలో కాలేదు. బీటే బీటీఎస్‌ని ఫాలో అయ్యింది' అని నెటిజన్‌ రాసుకొచ్చాడు.

ఈ వీడియోలో బీటీఎస్‌ బృందం ఆర్‌ఎం, జిన్‌, సుగా, జె.హోప్‌, జిమిన్‌, వి, జంగ్‌కూక్ వేసిన స్టెప్పులు.. మన తెలుగు పాట బీటుకు సరిపోయేలా ఉండటం వల్ల ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్రధాని మోదీ 'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసినట్లుగా ఉన్న యానిమేటెడ్‌ వీడియోను మరో నెటిజన్‌ క్రియేట్‌ చేశాడు. ఇది కూడా నెటిజన్లను ఆకర్షిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:హీరోల పేర్లే సినిమాకు టైటిల్స్.. క్రేజీ ట్రెండ్

ABOUT THE AUTHOR

...view details