తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్కడ అందరూ 'పుష్ప' కోసం వెయిటింగ్: రాజమౌళి - ఆర్ఆర్ఆర్ ట్రైలర్

Pushpa movie: 'పుష్ప'.. తెలుగు ఇండస్ట్రీ సినిమా అని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రీ రిలీజ్​ వేడుకలో పాల్గొన్న ఆయన.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ss rajamouli
రాజమౌళి

By

Published : Dec 12, 2021, 9:55 PM IST

Pushpa pre release event: తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన ఒక అద్భుతమైన బహుమతి అల్లు అర్జున్‌ అని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రశంసించారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన చిత్రం 'పుష్ప'. రష్మిక హీరోయిన్. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి అతిథిగా విచ్చేశారు.

Rajamouli speech: "ఈరోజు ఒక రకంగా బాధగా, ఆనందంగా ఉంది. నా స్నేహితుడు, ఫేవరెట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఇక్కడ లేరు. 'పుష్ప'ను అదిరిపోయేలా చూపించడానికి ముంబయి వెళ్లారు. నాకు సుక్కు సినిమాలంటే ఇష్టం. మేమిద్దరం సినిమాల గురించి ఒకరికొకరు మెస్సేజ్‌లు పంపుకొంటా. ఈ మధ్య సుక్కు ఒక మెస్సేజ్‌ చేశాడు. 'సర్‌ టైమ్ సరిపోవటం లేదు' అని అన్నాడు. 'సుక్కు నువ్వు తీసిన సినిమాను నమ్ము. నువ్వు చేయాల్సింది చేసేయ్‌. జరగాల్సింది జరుగుతుంది' అని సమాధానం ఇచ్చా. దానికి తగినట్లు గానే పగలు రాత్రీ తేడా లేకుండా సుకుమార్‌ పనిచేస్తున్నాడు. సినిమా అద్భుతంగా వస్తుందన్న నమ్మకం ఉంది. 'ఆర్‌ఆర్ఆర్‌' పని మీద ముంబయికి వెళ్లినప్పుడు ఎవరిని అడిగినా 'పుష్ప కోసం చూస్తున్నాం' అంటున్నారు. బన్నీ నువ్వు తప్పకుండా అక్కడ కూడా ప్రచారం చేయాలి. ప్రేక్షకులు అంతలా ఎదురు చూస్తున్నారు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. 'పుష్ప' కేవలం నీ సినిమా మాత్రమే కాదు. తెలుగు ఇండస్ట్రీ సినిమా. దీని గురించి అందరికీ తెలియాలి. మరింత ప్రచారం దక్కాలి. టీజర్‌ చూసినప్పుడు నా కళ్లు చెదిరిపోయాయి. విజువల్స్‌ అదిరిపోయాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ చూసి ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతారు. చివరిగా అల్లు అర్జున్‌ డెడికేషన్‌, దర్శకుడిపై అతనికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్‌. నువ్వు ఇండస్ట్రీకి లభించిన గిఫ్ట్‌. అతడిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. డిసెంబరు 17న థియేటర్లలో సందడే సందడి" అని అన్నారు. రాజమౌళితోపాటు యువ దర్శకులు మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సమంత ప్రత్యేక గీతం చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది. డిసెంబరు 17న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details