తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' ఓటీటీ రిలీజ్​ ఎప్పుడంటే? - అమెజాన్​ ప్రైమ్ పుష్ప

Pushpa OTT Release: థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే 'పుష్ప' పార్ట్-1​ ఓటీటీ రిలీజ్​పై వార్తలు వస్తున్నాయి. అమెజాన్​ ప్రైమ్​లో విడుదలయ్యే ఈ చిత్ర​ రిలీజ్​ డేట్​ను ఖరారైందని తెలుస్తోంది.

pushpa the rise
'పుష్ప' ఓటీటీ రిలీజ్​ ఎప్పుడంటే?

By

Published : Dec 22, 2021, 9:42 AM IST

Updated : Dec 22, 2021, 11:39 AM IST

Pushpa OTT Release: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' చిత్రం అభిమానులకు ఫుల్​మీల్స్​ పెట్టేసింది. బన్నీ​-సుకుమార్​ కాంబినేషన్​ మరోసారి అదరగొట్టేసింది. దీంతో ప్రేక్షకులు 'పుష్ప'ను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అయితే థియేటర్లలో ఈ మూవీ హవా కొనసాగుతుండగానే ఓటీటీ రిలీజ్​పై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ చిత్రం డిజిటల్​ రైట్స్​ ప్రముఖ ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​ ఇప్పటికే కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో 'పుష్ప-ది రైజ్'​ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రైమ్​లో రిలీజ్​ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించిన చిత్రబృందం ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటోంది.

ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల్లో సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం ఈ సినిమా జనవరి చివరి వారంలో ప్రైమ్​లో అందుబాటులోకి వస్తుంది.

ఇదీ చూడండి :ఈ ఏడాది టాలీవుడ్​లో మెరిసిన కొత్త తారలు వీరే!

Last Updated : Dec 22, 2021, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details