Pushpa success meet: తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో విడుదలైన అన్ని కేంద్రాల్లో 'పుష్ప' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆ చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో రూ.173 కోట్ల వసూళ్లు సాధించిందని వెల్లడించారు.
ఈ ఆనందాన్ని పంచుకునేందుకు మంగళవారం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్మాత యర్నేని నవీన్ తెలిపారు.