తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' సినిమాను ఈ స్టార్స్ వదులుకున్నారా? - pushpa movie vijay sethupathi

Pushpa movie: థియేటర్లో రిలీజ్​ అయినప్పుడు మిశ్రమ స్పందన అందుకున్న 'పుష్ప' సినిమా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెగ సందడి చేస్తోంది. పరభాషా నటీనటుల నుంచి అంతర్జాతీయ ఆటగాళ్ల వరకు ఈ చిత్రం పాటల్ని రీల్స్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. అయితే ఇంత సెన్సేషన్​ సృష్టించిన ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను కొందరు స్టార్స్ చేయాల్సింది. కానీ పలు కారణాలతో వారు చేయలేకపోయారు.

pushpa movie
పుష్ప మూవీ

By

Published : Jan 27, 2022, 7:11 AM IST

ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు పోషించడమనేది ఇండస్ట్రీలో సర్వసాధారణం. తొలుత వీళ్లైతే.. బాగుంటారనుకున్నా ఆఖరి నిమిషంలో.. ఆ నిర్ణయాలు తారుమారవుతుంటాయి. గతంలో వచ్చిన చాలా సినిమాల్లో ఇలా జరిగాయని వింటూనే వచ్చాం. సరిగ్గా 'పుష్ప' విషయంలోనూ ఇదే జరిగిందట. కారణాలు ఏవైనా ఈ సినిమాను కాదనుకున్న ఆ నటులెవరో ఓ లుక్కేద్దాం పదండి!

పుష్ప సినిమాలో అల్లు అర్జున్

మొదట.. మహేశ్!

mahesh babu Pushpa movie: మహేశ్‌బాబుతో '1: నేనొక్కడినే' తీశాక... దర్శకుడు సుకుమార్‌ మరోసారి ఆయనతో మాస్‌ మూవీ తీయాలని భావించారట. అదే 'పుష్ప'. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్‌ లుక్స్‌ పరంగా వివిధ రకాలుగా కనిపించాల్సి ఉంటుంది. వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం, క్యారెక్టర్‌ లుక్‌ విషయంలో.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. అలా మహేశ్‌ చేయాల్సిన 'పుష్పరాజ్‌' అల్లు అర్జున్‌కు చేరువైందని ఇండస్ట్రీ టాక్‌.

మహేశ్​బాబు-అల్లు అర్జున్

శ్రీవల్లి.. 'సమంత'నే..

samantha srivalli: 'ఉ అంటావా.. ఊ ఊ అంటావా' అని సమంత ఐటమ్‌ సాంగ్‌తో ఓ ఊపు ఊపినా.. అసలు సామ్‌ చేయాల్సింది 'చూపే బంగారమాయనే శ్రీవల్లి'లోనట. 'రంగస్థలం'లో 'రామలక్ష్మీ'గా మెప్పించిన ఆమెను 'శ్రీవల్లి'గానూ చూపించాలని సుకుమార్‌ అనుకున్నారట. పలు కారణాలతో సమంత 'నో' చెప్పడం.. ఆపై కథ రష్మికకు చెప్పడం.. ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట!

సమంత- రష్మిక

ఊ ఊ అన్నది వీళ్లేనట..

సుకుమార్‌ సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌కు ఉన్న క్రేజ్‌ వేరు. ఆర్యలో 'అ అంటే అమలాపురం' నుంచి రంగస్థలంలోని 'జిగేల్‌ రాణి' వరకూ ఆ మార్క్‌ కనిపిస్తుంటుంది. అందుకే 'పుష్ప' ప్రత్యేక గీతాన్ని అలానే ప్లాన్‌ చేశారట. మొదట బాలీవుడ్‌ భామలు దిశా పటానీ, బాహుబలి ఫేమ్‌ నోరా ఫతేహి పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. నోరానే చేస్తుందనే టాక్‌ వినిపించినా.. ఆమె భారీ పారితోషికం డిమాండ్‌ చేయడం వల్ల వెనుదిరిగిన మేకర్స్.. చివరి నిమిషంలో ప్రత్యేక గీతానికి సమంతను ఎంపిక చేశారట.

దిశా పటానీ-నోరా ఫతేహి

విలన్స్‌గా వీళ్లే.. ఈ ముగ్గురు

Vijay sethupathi pushpa movie: హీరో, విలన్‌ ఇలా పాత్ర ఏదైనా వైవిధ్యం చూపించగలిగిన నటుడు విజయ్‌సేతుపతి. 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించిన విజయ్‌నే మొదట భన్వర్‌లాల్‌ షెకావత్‌ పాత్ర చేయాల్సి ఉందట. అప్పటికే వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విజయ్‌ డేట్స్‌ సర్దుబాటుకాక చేయలేకపోయారట. దీంతో బెంగాలీ నటుడు జిష్ణు సేన్‌గుప్త, టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు కథ వినిపించినా.. పలు కారణాలతో ఆ పాత్ర చేయడానికి వాళ్లు ముందుకు రాలేదు. చివరికి మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌కు కథ నచ్చడం వల్ల ఓకే చేసి.. తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

విజయ్ సేతుపతి-ఫహాద్ ఫాజిల్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details