అల్లు అర్జున్ 'పుష్ప'తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. మరో వారంరోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసి, ప్రచారాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీజర్/ట్రైలర్ను ఈ నెల చివరిలో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
అల్లు అర్జున్ 'పుష్ప'.. మరో వారం రోజులే..! - pushpa trailer
బన్నీ 'పుష్ప' చిత్రీకరణ చివరిదశకు వచ్చేసింది. నవంబరు ఆఖరికల్లా ట్రైలర్ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ పుష్ప
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న 'పుష్ప'.. డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తెరకెక్కిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ ప్రతినాయకులుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
ఇవీ చదవండి:
Last Updated : Nov 7, 2021, 5:30 AM IST