తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఊ అంటావా ఉఊ అంటవా' సాంగ్.. ఈ హస్కీ వాయిస్ ఎవరిదో తెలుసా? - allu arjun pushpa movie

Pushpa item song singer: రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పాట గురించే తెగ మాట్లాడేసుకుంటున్నారు. అదే సమంత 'ఊ అంటవా..' గీతం. అయితే ఈ పాట పాడింది ఎవరో తెలుసా?

samantha item song
సమంత పుష్ప ఐటమ్ సాంగ్

By

Published : Dec 13, 2021, 5:31 PM IST

Updated : Dec 14, 2021, 9:47 AM IST

Pushpa songs: 'పుష్ప' త్వరలో రిలీజ్​ కానుంది. అల్లు అర్జున్ గెటప్​, సుకుమార్ డైరెక్షన్​ కోసం ఈ సినిమాకు వెళ్లే వాళ్లు కొంతమందైతే.. సమంత 'స్పెషల్' సాంగ్ కోసం వెళ్లేవాళ్లు మరికొంతమంది. అంతలా ఫ్యాన్స్​ను మత్తెక్కిస్తుంది ఈ సాంగ్. 'ఊ అంటవా..' అంటూ సినిమాపై తెగ క్రేజ్ పెంచుతోంది.

ఈ పాటకు చాలా ప్రత్యేకతలు!

ఇప్పటివరకు హీరోయిన్​గా ఎన్నో సినిమాలు చేసిన సమంత తొలిసారి స్పెషల్ సాంగ్​ చేస్తుందనగానే ప్రేక్షకుల్లో ఓ రకమైన ఎగ్జైట్​మెంట్. ఎలా ఉంటుంది? ఎలాంటి స్టెప్పులు వేస్తుందా? అని. అయితే ఆ సందేహాలన్నీ పటాపంచాలు చేస్తూ 'ఊ అంటవా మామ.. ఊహు అంటవా' సాంగ్​తో యూట్యూబ్​లో సమంత దుమ్మరేపుతోంది.

Indravati chauhan songs: ఈ పాట పాడింది ఇంద్రావతి చౌహాన్. టాలీవుడ్​లో ఇప్పటికే ఎన్నో పాటలు పాడిన మంగ్లీ అలియాస్ సత్యవతి చౌహాన్ చెల్లెలు ఈమె. గతంలో ఇంద్రావతి పాడిన ఓ పాటను ఎక్కడో విని ముగ్దుడైన దేవిశ్రీ ప్రసాద్.. 'పుష్ప' సినిమాలోని స్పెషల్​ సాంగ్​ ఈమెతోనే పాడించాలని ఫిక్యయ్యారు! అలా 'ఊ అంటవా మావ ఊహు అంటవా' సాంగ్ పాడించారు. ఇప్పుడు ఆ గీతం కాస్త యూట్యూబ్​లో సెన్సేషన్​ అయింది.

Samantha pushpa song: ఈ పాటలో సమంత-అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు అయితే కేక పుట్టిస్తున్నాయి. ఇంద్రావతి వాయిస్​కు తోడు బన్నీ ఒడిలో కూర్చుని సామ్ వేసిన స్టెప్ అయితే పూర్తి వీడియో సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనిపించేలా చేస్తోంది.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. లారీ డ్రైవర్​గా నుంచి డాన్​గా ఎలా మారారు అనే విషయాన్ని 'పుష్ప' తొలి భాగంలో చూపించనున్నారు. రష్మిక హీరోయిన్​. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో ఈ సినిమా నిర్మించింది. 'పుష్ప'.. డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ కానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 14, 2021, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details