అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7న పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ప్రస్తుతం 32 మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. మిలియన్ లైక్స్‌కు చేరువైంది.
'బాహుబలి', 'రాధేశ్యామ్' రికార్డు బ్రేక్ చేసిన 'పుష్ప' - పుష్ప టీజర్ రికార్డు
బన్నీ 'పుష్ప' పరిచయ వీడియో సరికొత్త రికార్డును సృష్టించింది! లైక్స్ విషయంలో బాహుబలి, 'రాధేశ్యామ్'లను దాటేసింది.
ముఖ్యంగా లైక్స్ విషయంలో 'బాహుబలి', 'రాధేశ్యామ్' చిత్రాల రికార్డును 'పుష్ప' అధిగమించింది. 'తగ్గేదే..లే' అని బన్నీ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, సునీల్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆగస్టు 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.