'పుష్ప' సినిమా నుంచి విలన్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్(fahadh faasil pushpa), బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తలపై గాటు, గుండు లుక్‌తో ఉన్న ఆయన ఫొటో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించడమే కాకుండా సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
Pushpa Movie Villain: 'పుష్ప' విలన్ గుండు లుక్ అదిరింది - అల్లు అర్జున్ ఫహద్ ఫాజిల్ పుష్ప మూవీ
దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్.. 'పుష్ప' చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా, అదికాస్త అంచనాల్ని పెంచేస్తోంది.
![Pushpa Movie Villain: 'పుష్ప' విలన్ గుండు లుక్ అదిరింది pushpa fahadh faasil first look](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12899084-thumbnail-3x2-fahad-fasil1.jpg)
పుష్ప మూవీలో ఫహద్ ఫాజిల్
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో 'పుష్ప'ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇందులో బన్నీకి(allu arjun) జోడీగా రష్మిక(rashmika mandanna) చేస్తోంది. కన్నడ నటుడు ధనుంజయ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సుకుమార్ డైరెక్టర్. మైత్రీమూవీమేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఇవీ చదవండి:
Last Updated : Aug 28, 2021, 11:41 AM IST