తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​లో బన్నీ ధమాకా.. రూ.100 కోట్ల 'పుష్ప' - Pushpa Rs 100 crores Hindi collection

Pushpa movie: అగ్రకథానాయకుడు అల్లు అర్జున్.. బాలీవుడ్​లో తన మార్క్​ క్రియేట్ చేశారు. 'పుష్ప' సినిమాతో రికార్డు స్థాయిలో రూ.100 కోట్లు సాధించారు. ప్రభాస్​ తర్వాత ఈ ఘనత అందుకున్నారు.

Pushpa allu arjun
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

By

Published : Jan 31, 2022, 9:57 AM IST

Allu arjun pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాను అస్సలు హిందీలో రిలీజ్​ చేయకూడదని అనుకున్నారు. కానీ చేశారు. అయితే ఎలాంటి పబ్లిసిటీ కూడా చేయకపోవడం వల్ల ఈ సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుందోనని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాలకు కూడా అందకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు సొంతం చేసింది.

Pushpa hindi collection: 'పుష్ప' హిందీ వెర్షన్.. ఆదివారంతో కలిసి దాదాపు రూ.100 కోట్ల నెట్​ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నప్పటికీ, థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ వస్తూనే ఉండటం మరో విశేషం.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్​ లుక్స్​లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలోని 'శ్రీవల్లి' పాట, 'పుష్పరాజ్' డైలాగ్​ అయితే ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేక చెపాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, బాలీవుడ్​ సెలబ్రిటీలతో పాటు ఎంతోమంది ఈ రెండింటిని రీల్స్, టిక్​టాక్ వీడియోలు చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచేశారు. అల్లు అర్జున్​ నటనకు కూడా ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు.

ప్రభాస్

Prabhas allu arjun: హిందీలో తొలిసారి రూ.100 కోట్ల మార్క్​ అందుకున్న బన్నీ.. డార్లింగ్ ప్రభాస్ తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు హీరోగా రికార్డు సృష్టించారు. 'బాహుబలి' సిరీస్​, 'సాహో' సినిమాలతో బాలీవుడ్​లో సోలోగా రూ.100 కోట్లు సాధించారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ మార్క్​ను అందుకుని ఘనత సాధించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details