స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో చిత్రీకరణ సజావుగా సాగినట్లు వెల్లడించింది. ఈ షూటింగ్‌కు ఎంతగానో సహకరించిన అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.
"రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో 'పుష్ప' చిత్రం రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అక్కడి ప్రజలు, పాలకవర్గానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సహకారం లేకపోతే షూటింగ్ ఇంత సజావుగా జరిగేది కాదు."