తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​లో బన్నీ ధమాకా.. కళ్లు చెదిరేలా 'పుష్ప' వసూళ్లు - allu arjun pushpa movie

Pushpa hindi collection: ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లను అందుకున్న​ 'పుష్ప'.. బాలీవుడ్​లో రూ.75 కోట్ల మార్క్​ వైపు దూసుకుపోతుంది. మూడోవారంలోనూ కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.

Pushpa hidi movie
పుష్ప హిందీ మూవీ

By

Published : Jan 2, 2022, 2:42 PM IST

Pushpa hindi movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' హిందీ వెర్షన్.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రిలీజై ఇన్ని రోజులు అవుతున్నా సరే కలెక్షన్లు, అదిరిపోయే రేంజ్​లో వస్తున్నాయి.

ఇప్పటికే 'పుష్ప' హిందీ వెర్షన్​ వసూళ్లు రూ.50 కోట్లు దాటాయి. శనివారం ఒక్కరోజే రూ.6.1 కోట్ల కలెక్షన్ రావడం విశేషం. ఇదంతా చూస్తుంటే రూ.75 కోట్ల మార్క్​ను అందుకోవడానికి పెద్దగా సమయం పట్టేలా కనిపించడంలేదు. ఇదే జరిగితే మాత్రం పలు సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం.

పుష్ప హిందీ మూవీ

అయితే 'పుష్ప' సినిమాకు తెలుగులో చాలా తక్కువ పబ్లిసిటీ చేశారు. హిందీ విషయానికొస్తే చిత్ర రిలీజ్​కు ముందు కేవలం ఓ పోస్టర్​ మాత్రమే విడుదల చేశారు. అలాంటిది ఇప్పుడు కలెక్షన్లు రూ.75 కోట్లకు చేరువవుతుండటం సినీ ట్రేడ్​ విశ్లేషకుల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. బన్నీ సత్తా ఏంటనేది అందరికీ తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details