టాలీవుడ్ సినిమాల కోసం కేవలం తెలుగు అభిమానులే ఎదురుచూసే రోజులు పోయాయి. దేశం మొత్తంలో ఉన్న అభిమానులు ఎదురుచూసే రోజులొచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాలు విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతూ ఇండస్ట్రీలకు పెద్దన్న బాలీవుడ్‌కు సవాల్ విసురుతున్నాయి.
పుష్ప టాప్..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువ మంది ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల జాబితాను ఐఎంబీడీ (ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్) తాజాగా విడుదల చేసింది. అందులో రెండు తెలుగు చిత్రాలు స్థానం సొంతం చేసుకున్నాయి. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' అగ్రస్థానంలో నిలిచి తెలుగు సినిమా పవర్ చూపించింది. నాలుగో స్థానంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న 'రాధేశ్యామ్' నిలిచింది.
భారీ స్థాయిలో..
ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న 'పుష్ప'పై మొదటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. అల్లుఅర్జున్, సుకుమార్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం వల్ల మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల చేయనున్నారని సమాచారం రావడం వల్ల సినిమాపై ఆసక్తి రెట్టింపయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
భారీ బడ్జెట్..
మరోవైపు పాన్ ఇండియాస్టార్‌గా మారిన ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రంపైనా అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోందీ చిత్రం. ఈ చిత్రానికి జసిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జూలై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కరోనా ప్రభావంతో చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. విడుదల తేదీలపై చిత్రబృందాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఎక్కువ మంది ఎదురుచూస్తున్న సినిమాల జాబితా..
1. పుష్ప