Allu Arjun in Uttarakhand: 'పుష్ప' సినిమాతో ఉత్తరాదిలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. దక్షిణాదిలో సూపర్స్టార్డమ్ ఉన్న అతడికి.. నార్త్‌లోనూ మాస్ ఫోలోయింగ్ ఏర్పడింది. దానికి నిదర్శనమే ఉత్తరాఖండ్‌లో జరిగిన తాజా సంఘటన.
ఇటీవలే జాలీగ్రంథ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో దిగాడు బన్నీ. మాస్క్ ధరించినప్పటికీ ప్రజలు అతడిని గుర్తుపట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కొందరైతే దేవభూమికి స్వాగతం అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. అక్కడి నుంచి నరేంద్ర నగర్‌లోని ఆనంద రిసార్ట్‌కు వెళ్లాడు ఐకాన్‌స్టార్.