Allu arjun pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సందడి అస్సలు తగ్గట్లేదు. థియేటర్ల్లో, సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'పుష్ప' రెండో భాగం గురించి ఆసక్తికర విషయాలను నిర్మాత నవీన్ వెల్లడించారు.
'పుష్ప' పార్ట్-2 షూటింగ్ ఫిబ్రవరి-మార్చిలో ప్రారంభమవుతుందని నిర్మాతల్లో ఒకరైన నవీన్ యర్నేని చెప్పారు. తొలి భాగం కంటే మరింత బాగా సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్టైల్లో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ విడుదల తమకు ముఖ్యమేనని అన్నారు.
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'పుష్ప' సక్సెస్‌మీట్ డిసెంబరు 20న తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల నేపథ్యంగానే తెరకెక్కించారు. అందుకే తిరుపతిలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.