Jana Gana Mana Movie Vijay Devarakonda: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన కలల ప్రాజెక్టు 'జనగణమన'ను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు ప్రకటించారు. నేడు(మంగళవారం) ఈ మిషన్‌ను లాంఛ్ చేశారు. 'జేజీఎమ్' పేరుతో టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దేశ చిత్ర పటం చుట్టూ లక్షలాది సైకులు మోహరించి ఉండటం, భయంకరమైన యుద్ధ వాతావరణంలో శత్రువులను అంతమొందించేందుకు నింగి నుంచి భారత సైనికులు నేలకు దూకుతున్న దృశ్యాలతో తొలిపోస్టర్‌ను డిజైన్ చేశారు. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా ఉన్న పోస్టర్‌తో దేశ సైనిక శక్తిని చాటేలా జనగణమన ఉండబోతుందని దర్శకుడు పూరి స్పష్టం చేశారు. ఈ మూవీలో సైనికుడి పాత్రలో విజయ్ కనిపించనున్నారు.
దీంతో పాటే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేశారు. 2023 ఆగస్టు 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై చార్మికౌర్, దర్శకుడు వంశీపైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం.